జనసేన చీరాల చేనేత వికాస విభాగ కమిటీ నియామకం

చీరాల, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదంతో చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత వికాస విభాగ అధ్యక్షులు కర్న కిరణ్ తేజ కలసి చీరాల నియోజకవర్గ చేనేత వికాస విభాగ కమిటీని ఏర్పాటు చేస్తూ అధ్యక్షులుగా బుద్ధి శ్రీహర్షను, ఉపాధ్యక్షురాలుగా బూడిద సౌజన్య, ఉపాధ్యక్షుడిగా బండి నాగరాజు, ప్రధాన కార్యదర్శులుగా గౌరబత్తుని శివ నాగరాజు, నాసిక మహేష్, చల్లా సురేష్, వంకం సురేష్, కార్యదర్శులుగా మాచర్ల నవీన్, బుద్ధి శివ కిరణ్, పృథివీ శ్రీనివాసులు, గుండు నాగబాబు, సంయుక్త కార్యదర్శిగా బిట్ర ప్రసాద్ లను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా బుద్ధి శ్రీహర్ష మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి ఈ బృహత్తర బాధ్యతలు అందించిన అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో చేనేత కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉమ్మడి కూటమిలో భాగంగా చీరాల నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మద్దులూరి మాలకొండయ్యతో కలిసి ఆయా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని చెప్పడం జరిగినది. అలానే ఈ రాబోయే ఎన్నికల్లో జనసేన-బీజేపీ-టీడీపి ఎన్డీఏ కూటమి టీడీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మద్దులూరి మాలకొండయ్యకి జనసేన పార్టీ తరపున మరియు చేనేత సామాజిక వర్గాన్ని జాగృతం చేసి పూర్తిగా సహకారలు అందిస్తూ అఖండ మెజారిటీతో గెలిచే విధంగా బలంగా నిర్మాణాత్మకంగా కృషి చేస్తానని చెప్పడం జరిగినది.