జనసేన పార్టీ భీమదేవరపల్లి మండల కమిటీ నియామకం

హుస్నాబాద్: జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేసేందుకు భీమదేవరపల్లి మండల కమిటీని నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. నూతన రాజకీయ విప్లవానికి జనసేన బీజం వేసిందన్నారు. సామాన్య యువతను నాయకులుగా మారుస్తూ జనసేన రాజకీయం చేయబోతుందని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్ది పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష అన్నారు. ముందు ముందు గ్రామ స్థాయిలో కమిటీలు వేసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నూతన కార్యవర్గం అధ్యక్షులు నద్దునూరి జయక్రిష్ణ, ఉపాధ్యక్షులు గడిపె పవన్, ప్రధాన కార్యదర్శి బుంగ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొక్క విక్రమ్, దేవరాజు హరీష్, సెక్రటరీ ఎంత్యాల రాజు, తాళ్ళపల్లి ప్రణయ్, సోషల్ మీడియా సెక్రెటరీ దొంతరబోయిన అమర్, ఎక్జిక్యూటివ్ మెంబెర్స్ నద్దునూరి సాయితేజ, మాడుగుల సతీష్ కుమార్, అలుగు అజయ్, మిట్టపెల్లి రమేష్, వేముల వంశీ, నద్దునూరి చరణ్ చంద్ తదితరులు పాల్గొన్నారు.