నరవ గ్రామంలో జనసేన పార్టీ బూత్ కమిటీల నియామకం

పెందుర్తి: నరవ గ్రామం,88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ నాయకులు గళ్ళ శ్రీనివాస్, వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో 75,76,77,78 బూత్ లకు కమిటీ నియామకం చేయడం జరిగింది, గళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రోజు రోజు కి జనసేన పార్టీ ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, దాన్ని మనం అందరం కలిసికట్టుగా ప్రజలకు భరోసా కల్పించి ఓటర్స్ గా మార్చి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ని చేయడంలో కీలకపాత్ర పోషించాలని, గ్రామంలో ఏటువంటి సమస్య ఉన్న జనసేన పార్టీ వద్దకు తీసుకొని వస్తే సాయ శక్తుల వాటిని తీర్చి ప్రజలకు భరోసా కల్పిద్దామని మాట్లాడడం జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ తక్కువ టైంలో నరవ గ్రామంలో ఉన్న జనసేన పార్టీ సభ్యులు మీటింగ్ రావడాన్ని అభినందిస్తున్నాను, ఆదివారం జరిగిన మీటింగ్ జనసేన పార్టీ అభివృద్ధికి ఒక ప్రణాళిక మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాలు చెప్పడం వలన మన గ్రామంలో పార్టీ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనోగతం ఈరోజు ప్రభుత్వం అరాచక పాలన ఆగాలంటే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం మాత్రమే పరిష్కారం అని, ప్రతి బూతుకి 6గురు సభ్యులను నియమిస్తూ వారికి 1 పరిశీలకున్ని నియమించడం జరిగింది. ఈ విధంగా 4 బూతులకు 28మంది సభ్యులను నియమించడం జరిగింది. మిగిలిన సభ్యులను కూడా గుర్తించి మిగతా కమిటీలు వేయడం జరుగుతుంది అని, పెద్దలు చెప్పినట్లు బూత్ కమిటీ మెంబర్స్ ప్రాముఖ్యత చాలా ముఖ్యం కావున బూత్ కమిటీలో ఉన్న సభ్యులందరూ అభినందనలు తెలియజేసుకుంటూ మీరందరూ జనసేన పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ ఈ నరవ గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు గన్రెడ్డి అశోక్ కుమార్, గంన్రేడ్డి చిన్నారావు, శ్రీను, బొడ్డు నాయుడు, బొండాల రవి బాబు, రాడి పెంటరావు, గవర శ్రీను, నరవ సతీష్, నరవ రమేష్, గణేష్, జర్రిపోతుల నర్సింగరావు, గిరి, అచ్యుతరావు, పట్నల కోటి, మునస రాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.