జనసేన పార్టీ ఏన్కూరు మండల కమిటీ నియామకం

ఏన్కూరు: తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి నియోజకవర్గం స్థాయిలో ఏన్కూరు మండల కమిటీలను వైరా నియోజకవర్గ కోఆర్డినేటర్ సంపత్ నాయక్ ప్రకటించారు. కమిటీల వివరాలు ఇవి మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ, కొవ్వూరి మహేష్, దామెర్ల అశోక్ కుమార్, చుంచు భాస్కర్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మద్దెల పవన్ కళ్యాణ్, భాగం రవి, బీసీ సెల్ కోఆర్డినేటర్ పడిమల మురళీ కృష్ణ, పసుపులేటి కృష్ణ, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ బోజగాని సురేష్, ముక్తి సతీష్, మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ యాకూబ్ పాషా, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాశం భరత్, బూరుగ రాము, కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి అలాగే తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ కి, వైరా నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సంపత్ నాయక్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా మాకు ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఏన్కూరు మండలంలో జనసేన పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తాము. అలాగే గ్రామ, గ్రామాన పార్టీ బలోపేతానికి సమిష్టిగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మమ్మల్ని గుర్తించి మాకు ఈ బాధ్యతలు అప్పజెప్పిన వైరా నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సంపత్ నాయక్ కి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.