కళ్యాణదుర్గం జనసేన మండలాద్యక్షుల నియామకం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు మండల అధ్యక్షులు ప్రకటించడం జరిగింది . అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ మా మీద ఎంతో నమ్మకంతో మమ్మలను మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు మాకు ఇచ్చిన ఈ పదవులను పార్టీ బలోపేతం చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డికి మరియు అనంతపురం జిల్లా అధ్యక్షుడు శ్రీ T.C వరుణ్ కి అలాగే మా తోటి జనసైనికులకు మరియు వీరమహిళలు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం మండలం అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్, బ్రహ్మసముద్రం మండలం అధ్యక్షుడు ఆంజనేయులు, శెట్టూరు మండల అధ్యక్షుడు లేపాక్షి ఈరన్న, కుందుర్పి మండల అధ్యక్షుడు అపిలేపల్లి జై కృష్ణ, కంబదూర్ మండల అధ్యక్షుడు చంద్రమౌళి.