మండల ఎన్నికల ఇన్చార్జిల నియామకం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం మండలానికి ఎన్నికల ఇన్చార్జిగా నూతనంగా నియమితులైన జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, కార్వేటి నగరం టౌన్ ఇన్చార్జ్ విజయ్ లను కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు ఆధ్వర్యంలో మండల బూత్ కన్వీనర్ మండి సురేష్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి అన్నామలై పార్టీ కార్యాలయంలో దుస్సాలవాతో సన్మానించి అభినందించడం జరిగింది.

మిగతా మండలాల్లో ఎన్నికల ఇన్చార్జిలుగా నియమితులైన వారు
పెనుమూరు మండలం- భాను ప్రసాద్
ఎస్.ఆర్ పురం మండలం – హరీశ్వర్
జిడి నెల్లూరు మండలం – జైపాల్ రాజు
వెదురుకుప్పం మండలం – యతీశ్వర్ రెడ్డి
పాలసముద్రం మండలం – బుర్రా వెంకటేష్

కార్వేటి నగరం మండలం తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారు ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు శోభన్ బాబు మాట్లాడుతూ జనసేన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆదేశాల ప్రకారం ఈ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ థామస్ ని అఖండ మెజారిటీతో గెలిపించుకొనే దిశగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.