జనసేన పార్టీ నూతన కార్యవర్గ కమిటి నియామకం

తిరుపతి జిల్లా, నగరి నియోజకవర్గం, వడమాలపేటలో జరిగిన జనసేన పార్టీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ను మండల కేంద్రంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పూలమాలవేసి దుశ్శాలువాతో మండల అధ్యక్షుడు మునిశేఖర్ యాదవ్ స్వాగతం పలికి.. అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి బస్టాండ్ మీదుగా శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నగరి నియోజకవర్గంలో మొట్టమొదటి నూతన కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ బలోపేత దిశగా, సమిష్టి కృషితో పార్టీని ముందుకు నడపాలని కమిటీ సభ్యులకు, సూచనలు ఇచ్చారు. రానున్న 2024 ఎన్నికలలో 50 నుంచి 100 సీట్లు కైవసం చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేది పవన్ కళ్యాణ్ అని జ్యోష్యం చెప్పారు. జనసేన పార్టీని బలోపేతం చేసి నగరి గడ్డలో అధికార వైసిపి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి, తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. నగరి గడ్డను జనసేన అడ్డాగా మార్చడానికి నియోజకవర్గం ప్రజలు జన సైనికులు, సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా నా సేన – నా వంతు ఫోన్ పే, గూగుల్ పే, వారి వారి వంతు నాయకులంతా కలిసి పార్టీకి డబ్బులు సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడమాల పేట మండల పార్టీ అధ్యక్షుడు మునిశేఖర్ యాదవ్, మండల ఉపాధ్యక్షుడు చక్రవర్తి,రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన, జిల్లా అధికార ప్రతినిధి మహేష్, జిల్లా కార్యదర్శి స్వామినాధన్, జీడి నెల్లూరు పార్టీ ఇంచార్జ్ యుగంధర్ పొన్న, లక్ష్మి, మెరుపుల మహేష్, జగదీశ్ , బాటసారి, జిల్లా అనుబంధ విభాగ జనసేన పార్టీ నాయకులు, మండల కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.