విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పావాడ కామరాజు నియామకం

అనకాపల్లి నియోజకవర్గం: జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా కమిటీకి ఇటీవల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు. విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులుగా పంచకర్ల రమేష్ బాబుని గతంలో నియమించిన సంగతి తెలిసినదే. ఇప్పుడు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో కూడిన కమిటీని అధ్యక్షులు వారి అనుమతితో ప్రకటించారు. ఈ కమిటీలో అనకాపల్లి నియోజకవర్గం నుండి కశింకోట మండల కేంద్రం కశింకోట గ్రామానికి చెందిన పావాడ కామరాజుని ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ నియామకం పట్ల నియోజకవర్గ, కశింకోట మండల జనసేన శ్రేణులు హర్షతీరేఖాలు వ్యక్తం చేశారు. ఈ నియామకం పట్ల నియోజకవర్గ ఇంచార్జ్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు గారు మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కామరాజుకి శుభాకాంక్షలు తెలియజేసారు. జనసేన పార్టీలో తన ప్రయాణంలో మొదటి నుండి కామరాజు ఎంతో ఓర్పు, నేర్పుతో తనకి అండదండలు అందించారని, నియోజకవర్గంలో అన్నీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంలో తన అనుభవం చాలా ఉపయోగపడిందని కొనియాడారు. ఈ పదవికి కామరాజు వన్నె తీసుకురాగలరని, మరింత బాధ్యతతో పార్టీకి తన సేవలు అందించి, అధినేత ని అనుకున్న స్థాయిలో చూడడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్బంగా పావాడ కామరాజు మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తనకి అవకాశం కల్పించడం గొప్ప బాధ్యత గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ బాధ్యతతో మరింత సమయం, పార్టీ కోసం కష్టపడతానని యువతలో రాజకీయ చైతన్యం నింపి, తన అనుభవాన్ని అంతా జనసైనికులకి పంచి, వారిలో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా, నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావుని అనకాపల్లి ఎమ్మెల్యేగా చూడడమే లక్ష్యంగ ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సందర్బంగా తనని జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు గారికి, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులకు, తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.