జనసేన గళం వినిపించేందుకు ప్రతినిధుల నియామకo

జనసేన పార్టీని జనo లోకి తీసుకుని వెళ్ళే దిశగా జనసేన అడుగులు వేస్తూ పార్టీ తరపున మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గళాన్ని వినిపించడానికి ప్రతినిధులుగా కోటమరాజు శరత్ కుమార్, పి.వివేక్ బాబులను నియమించారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ వారికి అభినందనలు తెలియజేసారు. వీరిలో కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వివేక్ బాబు (40) బీటెక్ చదివి విశాఖపట్నంలో స్థిరపడ్డారు. కొంత కాలం పాటు ఓ ప్రముఖ న్యూస్ చానల్‌కు రిపోర్టర్‌గా పని చేశారు. అలాగే విజయవాడకు చెందిన శరత్ కుమార్ (42) ఎంటెక్, ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. పార్టీ స్థాపించిన మొదట్లో వీరు జనసేనలో చేశారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వీరి ఆసక్తిని గమనించిన పవన్ కళ్యాణ్ వీరిని మీడియా ప్రతినిధులుగా నియమించారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ద్వారానే అన్నిపనులు సాధ్యం అవుతాయని, ఒక అంచనాకు వచ్చిన పవన్ పార్టీలో వివిధ మార్పుచేర్పులు వంటి అంశాలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగానే టీవీ చర్చా కార్యక్రమంలో జనసేన తరపున బలమైన గొంతుక వినిపించాలని నిర్యాణయించుకున్నారు. దీనిలో భాగంగానే మీడియా ముందు గట్టి వాయిస్ వినిపించేందుకు ఓ ఇద్దరికీ జనసేన తరపున మీడియా డిబేట్ లలో బలమైన వాయిస్ వినిపించుకోవాలని పవన్ అభిప్రాయoతో ఈ మేరకు జనసేన మీడియా విభాగంలోకి ఇద్దరినీ తీసుకుంది.