ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలోని నిరుద్యోగులైన యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. యువతకు ఉపాధి ధ్యేయంగా ప్రత్యేకంగా రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి.. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలో నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని NAC సెంటర్ లో ఈ నెల 21న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యభివృద్ధి సంస్థ అధికారి ఆనంద్ రాజకుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో హ్యుండయ్ మోబిస్, నవభారత్ ఫెర్టిలైజర్స్, ఎల్ ఎల్ పి, కేఐఎంఎల్, వంటి ప్రముఖ కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేసేందుకు పాల్గొంటున్నాయి. దీనికోసం పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు.
Share this content:
Post Comment