జనసేన ఆధ్వర్యంలో ఆక్వారైతుల ఆక్రందన

  • రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని, చెరువులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని జనసేన భారీ ర్యాలీ

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులు, జనసైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. రొయ్యల రైతులకు విద్యుత్ సబ్సిడీతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని, రొయ్యల మేత ధరలు తగ్గించడంతో పాటు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. రొయ్యల కొనుగోలు దారులు సిండికేట్ అయ్యి, రొయ్యల ధరలు తగ్గించకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. గడియార స్తంభం సెంటర్ నుండి ప్రారంభమైన వేలాది మంది ఆక్వా రైతులు, జనసైనికులతో కొనసాగింది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల నుండి పెద్దసంఖ్యలో రైతులు, జనసైనికులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అమలాపురం నియోజకవర్గజనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించేవరకు జనసేన ఆక్వా రైతులకు అండగా ఉంటుందని జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు ఆక్వా రైతుల సమస్యలు, తెలియజేయడం జరిగిందని త్వరలోనే పవన్ కళ్యాణ్ ఆక్వా రైతుల సమస్యలపై స్పందిస్తారు అన్నారు. అనంతరం మరొక కార్యాచరణ ప్రకటిస్తామని రాజబాబు అన్నారు. ర్యాలీకి ముందు ఆక్వా రైతు ఆకుల రామారావు తయారుచేయించిన ఏరియేటర్స్ వంటి సామాగ్రితో ఉన్న జీపు ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ, పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, అమలాపురం నియోజకవర్గ పార్లమెంటరి ఇంచార్జ్ డి.ఎం.ఆర్ శేఖర్, కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్, కాకినాడ సిటీ నాయకులు వానపల్లి హరికృష్ణ, పెద్దిరెడ్డి ఉదయ్ భాస్కర్, గంగుమళ్ళ వీరబాబు, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరధి వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల మూర్తి, దేశిరెడ్డి సతీష్, నామా సాయి బాబు, అమలాపురం కౌన్సిలర్లు గొలకోటి విజయలక్ష్మి, గండి దేవి హారిక, మహదశ నాగేశ్వరరావు, చిక్కాల సతీష్, చిక్కం భీముడు, ఆకులు బుజ్జి, సుధా చిన్నా, గండి స్వామి, పొణకల ప్రకాష్, వలవల చిన్న, పిండి రాజా, గొలకోటి వాసు, లంకె వెంకట్రావు, ముద్దబత్తుల శ్రీను, కోటిపల్లి రాజు, పినిశెట్టి సురేష్, పలచోళ్ళ సురేష్, కంకిపాటి వీరబాబు, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, వీరమహిళలు మరియు పెద్దఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.