నెల్లూరు నగర సమీపంలోని విక్రమ సింహపురి యూనివర్శిటీలో బుధవారం డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెరైన్ బయాలజీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సెమినార్‌కు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ (ఏ.కే.యూ) ఆక్వా కల్చర్ విభాగం విద్యార్థులు హాజరయ్యారు. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి సూచనల మేరకు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబు, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు సహకారంతో విద్యార్థులు ఈ సెమినార్‌లో పాల్గొన్నారు. సహాయ ఆచార్యులు డాక్టర్ బి. సురేష్, డాక్టర్ అశ్వర్థ నారాయణ మార్గదర్శకత్వంలో, ఆక్వా కల్చర్ విభాగానికి చెందిన మొదటి సంవత్సర విద్యార్థులు పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తల ప్రసంగాలను ఆసక్తిగా విని, సమకాలీన శాస్త్రీయ విషయాలను అవగాహన చేసుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఏ.కే.యూ తరపున అంతర్జాతీయ స్థాయి సెమినార్‌లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని కల్పించిన వీసీ ప్రొఫెసర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హరిబాబు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహన్ రావు లకు విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంతర్జాతీయ సెమినార్‌లో ఇతర దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. విక్రమ సింహపురి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు సెమినార్‌ను ప్రారంభిస్తూ ముఖ్యోపన్యాసం అందించారు.
Share this content:
Post Comment