అరకు నియోజకవర్గ కేంద్రం టౌన్షిప్ రోడ్ల గుంతలు మరమ్మతు పనులు చేపట్టండి మహా ప్రభో!!

*జనసేన నాయకులు సాయిబాబా దురియా, అల్లంగి రామకృష్ణ, కిలో రాజ్ భరత్

అరకు నియోజకవర్గం: రెండవ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పిలుపుమేరకు డిజిటల్ క్యాంపెయిన్ భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, కేంద్రం టౌన్షిప్ పరిధిలో గల ప్రధాన రహదారి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద గజానికి దూరంలో రోడ్ల గుంతలు వద్ద జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా. మండల అధ్యక్ష కార్యదర్శులు అల్లంగి రామకృష్ణ. కీల్లో రాజ్ భరత్. సంతోష్ సింగ్. గతం లక్ష్మణరావు తదితరుల ఆధ్వర్యంలో రోడ్ల గుంతలు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రం టౌన్షిప్ పరిధిలోగల రోడ్ల గుంతలు పరిస్థితి యే ఇంత సమస్య గా ఉంటే మారుమూల ప్రాంతాలలో గల గిరిజన గ్రామాలలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటదో ఈ వైయస్సార్ ప్రభుత్వ హయాంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత నెల నిర్వహించిన మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో ఉన్న రోడ్ల గుంతలు జూలై 15 కల్లా పూర్తి చేస్తానని ఆమె ఇచ్చిన ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతోందని తెలిపారు. నిద్రపోతున్న ఈ ప్రభుత్వానికి జనసేన పార్టీ నిద్ర నుంచి లేపుతుంది అని, వైయస్సార్ ప్రభుత్వానికి జనసేన మేలుకొలుపు తుందని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ పర్యాటక కేంద్రమైన అరకు నియోజకవర్గ కేంద్రం టౌన్షిప్ పరిధిలో ఇంత అధ్వానంగా రోడ్ల పరిస్థితి ఉంటే జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో సిగ్గుపడాలో వారు ఆలోచించుకోవాలని తెలిపారు. కావున వైఎస్సార్ ప్రభుత్వం అరకు టౌన్షిప్ పరిధిలోగల రోడ్ల గుంతలు పరిస్థితి దృష్టిసారించి రోడ్ల మరమ్మతు తక్షణమే చేపట్టాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి ముందు గాను రోడ్ల గుంతలు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి నినాదాలు చేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు రాజు. రవి. నందు తదితరులు పాల్గొన్నారు.