విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అరకు నియోజకవర్గం డిజిటల్ క్యాంపెయిన్

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం నేటి నుంచి మూడు రోజులపాటు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని కార్యకర్తలను జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌ శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు అరకు నియోజకవర్గం అరకు వ్యాలీ మండలంలో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు డిజిటల్ క్యాంపెయిన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఎంతోమంది త్యాగ ఫలితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకో గలిగామని, దీన్ని కాపాడుకోలేక ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ ప్రభుత్వం మద్దతు తెలపడం ఒక పక్క పార్లమెంట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 22 మంది ఎంపీలు గళం విప్పి మాట్లాడకపోవడం ఆంధ్ర ప్రజలకు మోసం చేసినట్లేనని ఈ సందర్భంగా వైయస్సార్ ప్రభుత్వ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ ఎంపీలు తీరు మార్చుకోని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని చూసించారు. నేటి నుండి మూడు రోజులు వరకు నియోజకవర్గ పరిధిలో ప్రతి మండలం లో సోషల్ మీడియా వేదికగా గా డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ప్రజలకు తెలిజేయలని ఈ సందర్భముగా డిమాండ్ చేయడమైనది.