అరకులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సివేరి దొన్ను దొర ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. వనభంగి పంచాయతీ డుంబగూడ గ్రామంలో సూపర్ 6 పథకాలు గురించి ఓటర్ మహనీయులకు ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి అవగాహనా కలిపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావగానే పథకాలు గురించి వివరించడమైనది.

  1. మహిళకి ఉచితంగా బస్సు ఇస్తుంది మరియు ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్ ఇస్తారు.
  2. పెన్షన్ దారులకు సంవత్సరంలో 4000/-రూపాయలు ఇస్తారు.
  3. స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు ఇంట్లో ఎంత మంది చదువుతున్న విద్యార్థుల ఉంటే అందరికి ఇస్తారు. సంవత్సరానికి 15000/-రూపాయలు ఇస్తారు.
  4. మహిళలకు నెలకు 1500/-రూపాయలు ఇస్తారు
  5. ప్రతి రైతు అన్నలకు సంవత్సరానికి 20000/-రూపాయలు ఇస్తారు. యూవతి యూవకులకు నిరుద్యోగ భృతి డిగ్రీ చదివిన యువకులకు 3000/-రూపాయలు ఇస్తారు. మరియు 20 లక్షల మందికి ఉపాధి కలిపిస్తుంది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్ కొర్ర రాజు, జనసేన మండల యువ నాయకులు పవన్ బిజేపీ నాయకులు, బూత్ ఇన్ఛార్జి కొర్ర సత్తిబాబు కార్యకర్తలు పాంగి కామరాజు, కొర్ర కొండలరావు, కొర్ర బాలరాజు, వార్డు మెంబర్ కిల్లో రాంబాబు తదితరులు పాల్గొన్నారు.