అక్రమ ఆర్జనే దాహంతో ఇష్టారాజ్యంగా క్వారీ తవ్వకాలు: గాదె

గుంటూరు, అధికారం ఉంటే చాలు అక్రమంగా ఎంతైనా సంపాదించవచ్చన్నట్లు, వైసీపీ నాయకుల ధన దాహానికి పిల్లలు బలవుతున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల నియోజవర్గం దాచేపల్లి మండల పరిధిలో జరుగుతున్న అక్రమ క్వారీ తవ్వకాలను పరిశీలించారు. లీజుకు తీసుకునేది ఎకరం అయితే తవ్వేది 10 ఏకరాలుగా ఉందని, కనీసం లీజుదారుడు ఎవరు, ఎన్ని హెక్టార్లలో లీజు ఇచ్ఛారని, పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి కనీస బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని తప్పుపట్టారు. వచ్చే దారిలో ఓవర్ లోడ్ తో వెళ్తున్న కొన్ని ట్రాక్టర్లను ఆపి రాయల్టీ బిల్లు అడిగితే అటువంటివు మాకు తేలియాదు అంటూ చెప్పారని, ఈ విధంగా ప్రభుత్వ సంపదను అప్పనంగా దోచుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే మాటే శాసనంగా లీజులు కట్టబెడుతున్నారని, ప్రతినెలా ఆయన వాటా వసూలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై ధ్వజమెత్తారు. దోచుకున్న ప్రతి రూపాయికి లెక్క చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. ఇదే అదునుగా దాచేపల్లి లో ఉన్న అధికార పార్టీ నాయకులు అక్రమా క్వారీ తవ్వుతూ కోట్లకు పడగలెత్తుతున్నారని, ప్రజల ప్రాణాలు పణంగా పెడుతూ క్వారీ సాగితున్న అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు జనసేన పొరాడుతుందని గాదె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, పులి హరి, బడిదల శ్రీను, అంబటి మల్లి, అంకారావు, ఖాసీం, దుర్గారావు, తాడువాయి లక్ష్మీ, తోట నరసయ్య, రమేష్, అంకారావు, కొర్రపాటి నాగేశ్వరరావు, గంగరాజు, పతెల్లా మల్లి, నెల్లూరి రాజేష్, నాయక్, నాగబాబు, వెంకటేశ్వరరావు, మధు లాల్, పుల్లారావు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.