ఘనంగా అరికేరి జీవన్ కుమార్ జన్మదిన వేడుకలు

గుంతకల్లు నియోజకవర్గం: జనసేన నాయకులు అరికేరి జీవన్ కుమార్ జన్మదిన సందర్భంగా పట్టణంలోని గోపి బ్లడ్ బ్యాంక్ నందు ఏర్పాటు చేసిన “స్వచంద రక్తదాన శిబిరం రానికి” పెద్దయెత్తున వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు శ్రేణులు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 70కు పైగా యూనిట్లు కలెక్ట్ అయినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు వివిధ నాయకులు కార్యకర్తలు అభిమానులు మద్దతుదారులు పాల్గొనడం జరింది.