శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

ఈ నెల 19 నుంచి 27 తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపధ్యంలో తిరుమలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన గోపురంతో పాటు మాడవీధులు విద్యుద్దీపాల వెలుగు జిలుగులతో కనువిందు చేస్తున్నాయి. టీటీడీ గార్డెనింగ్‌ విభాగం ఆధ్వర్యంలో వివిధ పుష్పాలతో ఆలయ ప్రాకారాలను అలంకరిస్తున్నారు. విద్యుద్దీపాల వెలుగులో తిరుగిరి కాంతులు వెదజల్లే విధంగా ఏర్పాట్లు చేశారు.