శ్రీమతి వినుత కోటా హౌస్ అరెస్టు

  • పండుగ రోజు పోలీసులను కూడా ఇబ్బంది పెట్టి హౌస్ అరెస్టు చెయ్యడం సింహం లక్షణాలా!!

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటాను పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. వినాయక చవితి పండుగ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో సోమవారం మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు వితరణ చేస్తుండగా ఎస్పీ ఆదేశాల మేరకు హౌస్ అరెస్టు చేస్తున్నామని వినుతను అడ్డుకున్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని జగన్ తిరుమల వస్తున్నాడని హౌస్ అరెస్టులు చెయ్యడం చూస్తే జగన్ కి జనసేన అంటే ఇంత భయమా!!? పండుగ రోజు పోలీసులను కూడా ఇబ్బంది పెట్టి హౌస్ అరెస్టు చెయ్యడం సింహం లక్షణాలా!! సింగిల్ గా వచ్చే సింహానికి వేల మంది పోలీసులను పెట్టుకుని పరధాలను కట్టుకుని ప్రయాణం చేసే సింహానికి జనసేన పార్టీ అంటే ఇంత భయమా! ఇప్పుడు చెప్పాలి వైసీపీ పే.టి.ఎం కార్యకర్తలు మీ జగన్ సింహమా!!! పిల్లి నా అని!!?