చేతనైతే హత్యలు చేసేవారిని అరెస్ట్ చెయ్యండి: చిర్రి బాలరాజు

భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) ను అప్రజాస్వామికంగా, అన్యాయంగా, అరాచకంగా అరెస్టు చేయడం జరిగింది. భీమవరం టూటౌన్ సి.ఐ. కృష్ణభగవాన్, ఇద్దరు ఎస్సైలు 10మంది కానిస్టేబుళ్ళు మఫ్టీలో, స్పెషల్ ఫోర్స్ తో కలిసి అక్రమంగా వ్యవహరిస్తూ ఉదయాన్నే ఇంటికివచ్చి దౌర్జన్యపూరితంగా అరెస్టు చేయడం జరిగింది. అరెస్టు చేసి ఉదయం నుండి హైడ్రామా నడిపి ఎట్టకేలకు ఆచంటలోని పోడూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. తరువాత జనసైనికులు, నాయకుల నిరసనలకు వెనక్కి తగ్గి ఆయనను విడుదల చేసారు. ఇది అప్రజాస్వామికం. అనాగరికం, అక్రమం, అన్యాయమని జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు మండిపడ్డారు. గోవింద్ గారికి పోలవరం నియోజకవర్గం మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు మద్దతుగా నిలిచారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి చెత్త రాజకీయాలు ఎదుర్కోవడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. మీకు దమ్ము దైర్యం ఉంటే మీ వైసీపీ ప్రభుత్వంలోనే ఎంతోమంది దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రజలను దోచుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చెయ్యమని నిలదీశారు. ఈ కార్యక్రమంలో పాదం కృష్ణ, తోట రవి, చిన్ని, అడపా నాగరాజు, మెదేపల్లి శ్రీను, రాము, వంశీ, కూరం వెంకటేష్, అమృతపల్లి రవి కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.