అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి: మాదాల శ్రీరాములు

అరకు, విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనవాణి మరియు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ నాయకులను, జన సైనికులను, వీరమహిళలను ఉత్తరాంధ్ర నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరుపుటకు మరియు ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుల కుటుంబాలకి భరోసా ఇచ్చేందుకు దీనిట్లో భాగంగా పైన తెలిపిన కార్యక్రమాలు చేపట్టేందుకు వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్, జనసైనికులకు వైసీపి ప్రభుత్వం కార్యక్రమాలు జరగనివ్వకుండా అడుగడుగున అడ్డుపడడం ప్రభుత్వం తీరు సరైంది కాదని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలు జరగనివ్వకుండా చేసి నాయకులను జనసైనికులను భయబ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి సాధ్యపడలేదని ఎంతమంది పోలీస్ బలగాలను దింపిన ఉద్యమాలు ఆపలేరని తెలిపారు. వైసిపి మంత్రుల కార్ మీద దాడులు చేశారని జనసేన నాయకులను అటెంంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని తెలిపారు. ప్రభుత్వం వైఫల్యం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని తెలిపారు. జనసేన పార్టీ దాడుల సంస్కృతి కాదని దానికి అలాంటి వాటికి ఎప్పుడూ దూరంగా ఉంటుందని తెలిపారు. అధినేతపై రాష్ట్ర మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తక్షణం వెనక్కు తీసుకోవాలని లేనిపక్షంలో భవిష్యత్తులో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరును మార్చుకుని జనసైనికులపై నిఘా పెట్టడం కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ప్రజల పక్షాన జనసేన పార్టీ ఎప్పుడు అండదండగా ఉంటుందని వీలైతే ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ఎంత వరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని ఈ నేపథ్యంలో మాదాల శ్రీరాములు నియోజకవర్గం నాయకులను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నాయకులు బంగరు రామదాసు, పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణ్ రావు, ఆరకువేలి మండల అధ్యక్షులు అల్లంగి రామకృష్ణ, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మజ్జి కృష్ణం రాజు, డుంబ్రిగుడా మండలాధ్యక్షులు చినబాబు ముత్యం ప్రసాద్ పాల్గొన్నారు.