గజపతినగరం నియోజకవర్గం, మాజీ మంత్రి వర్యులు జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు శ్రీమతి పడాల అరుణ జన్మదిన వేడుకలకి అనేకమంది ప్రముఖులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు హాజరయ్యి ఆమెకు శుభాకాంక్షలు మరియు ఆశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆమె జన్మదిన సందర్భంగా మొదటిగా ఎం వెంకటాపురంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి గజపతినగరంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిని ఆమె సందర్శించి రోగులకు పళ్ళు, రొట్టెలు పంచడం జరిగింది. అనంతరం ఆమె స్వగృహం నందు జనసేన నాయకులు ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం మండల అధ్యక్షుడు మునకాల జగన్, దత్తిరాజేరు మండల అధ్యక్షుడు చప్ప అప్పారావు, గంట్యాడ మండల అధ్యక్షుడు సారధి అప్పలరాజు, రాంబాబు, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్, మండల లక్ష్మినాయుడు, ఐటి విభాగం కో-ఆర్డినేటర్ బోడసింగి సునీల్, తాళ్లపూడి కృష్ణ, పిఓసి ఆదాడమోహన్, దేవుపల్లి గ్రామం నుండి జనసేన లీగల్ సెల్ మెంబర్ రాపాక సాయి సురేష్, యాట్ల తిరుపతిరావు, యశ్వంత్, టిడిపి యూత్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment