అరుంధతి వాడ మహిళలకు అండగా నిలచిన జనసేన నాయకులు

రైల్వే కోడూరు మండల పరిధిలోని వివి కండ్రిక పంచాయతీ అరుంధతి వాడ గ్రామానికి చెందిన సంటి రమాదేవి, మినుకు వెంకటమ్మ, సంటి వెంకటమ్మ మహిళలకు రేషన్ కార్డు, వితంతు పింఛను, ఆసరా పథకం కింద వర్తించాల్సిన ప్రభుత్వ పదకాల కోసం రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆధ్వర్యంలో వి.వి కండ్రిక సచివాలయాన్ని సందర్శించి వీఆర్వో మెహబూబ్ భాష సమక్షంలో సచివాలయ అధికారులకు వివరాలను అందించడం జరిగినది.. ఈ సందర్భంగా సచివాలయ అధికారులు అన్ని వివరాలు సేకరించి ఆ ప్రాంతానికి చెందిన వాలంటీరు శంకరయ్య ద్వారా మహిళలకు వర్తించాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ కోరింది… ఈ మేరకు సచివాలయ అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పిమట మహిళలకు తద్వారా ఏదైనా సమస్యలొచ్చినా మళ్లీ పరిష్కరించేందుకు వస్తామని జనసేన పార్టీ వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దళిత నాయకులు నగిరిపాటి మహేష్, కాపు సంక్షేమ సేన ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎద్దల అనంతరాయలు, అంకి శెట్టి మణే, శివ కళ్యాణ్, చిన్న తదితరులు పాల్గొన్నారు.