నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రతి అడుగు పవన్ కళ్యాణ్ తోనే: తిప్పన దుర్యోధన రెడ్డి

ఇచ్చాపురం, నా ఊపిరి ఉన్నంత వరకు నా ప్రతి అడుగు పవన్ కళ్యాణ్ తోనే ఇందులో ఏ సందేహం లేదు నూటికి నూరు పాళ్ళు ఆయన నిర్ణయమే నా నిర్ణయం. ఆయన మా ఇచ్చాపురం నుండి జనసేన టికెట్ ఇవ్వకపోవడంతో మనసంతా గందరగోళంగా అనిపించింది కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర ప్రజలకు భవిషత్తు మార్గం అని నమ్మి నేనే ఆయన వెంటనే ఈ జన్మకి నడుస్తాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు అని రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి చెప్పారు. రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తాం ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పారు.