జనసేనాని జన్మదిన వేడుకలలో భాగంగా పేదలకు మోటూరి దంపతుల అన్నదానం

జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు మరియు చిందాడగరువు జనసేన పార్టీ ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు ధన సహాయంతో కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో మానసిక విద్యార్థులకు, ఇమ్మిడివరప్పాడు వృద్ధుల ఆశ్రమంలో మరియు అలాగే అమలాపురం టౌన్ బస్టాండ్ ఆవరణలో, గడిస్తంభం వద్ద, దేవి గుడి వద్ద, ఈదరపల్లి వంతెన వద్ద, పేదలకు, అనాధలకు, వృద్ధులకు, మానసిక రోగులకు, దివ్యాంగులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అమలాపురం నియోజకవర్గం ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు నెంబర్లు, వీర మహిళలు, నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *