గిరిసేన జనసేన 42వ రోజు

పాలకొండ: కళ్ళాల్లో ధాన్యం – రైతు కళ్ళలో కన్నీరు వీరఘట్టం మండలం, పాలకొండ నియోజక వర్గం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. గిరిసేన జనసేన 42వ రోజులో భాగంగా వీరఘట్టం మండలంలోని వివిధ గ్రామలలో రైతులను, సన్న కారు, చిన్నకారు రైతులు, కౌలురైతులను కలసిన జనసేన పార్టీ నాయకులు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వంద కిలోల బస్తాకి అదనంగా నాలుగు కిలోలు తూస్తున్నారు, కళాసీ లకి డబ్బు మేమే చెల్లిఒచాలి. డ్రైవర్ బేటాలతో సన్నకారు, చిన్నకారు రైతులు భారాన్ని భరించలేకపోతున్నాము. రైతుభరోసా కేంద్రాల నుండి లారీల సప్లై నిలిపివేశారు అని రైతులు వాపోయారు. అధికారులు ధాన్యం రవాణా చార్జీలు భరించిన రైతులకు మాత్రమే లారీలు సరఫరా చేస్తున్నారు. కౌలు రైతులు పొలంయజమానికి కౌలు ఇవ్వాలి. రైతుల కన్నీరు తప్ప కళ్ళాల్లోని ధాన్యం కదలడం లేదని అన్నదాతలు వాపోయారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం మాట్లాడుతూ ప్రస్తుత వైస్సార్సీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విధానం చూస్తే పాలకులు అరటిపండు ఒలిచి నోటిలో పెట్టిన చందంగా ఉందని క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగ ఉందని అన్నారు. సకాలం లో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఉత్తర ఆంధ్ర జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బి.పి.నాయుడు మాట్లాడుతూ క్విఒటా ధాన్యం బస్తా కి అదనంగా నాలుగు కిలోలు ధాన్యం ఎందుకు ఇవ్వాలి. రైతుభరోసా కేంద్రాలతో అన్నదాతలను లూటీ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు. అధికారంతో సంబంధం లేకుండా ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల ఇచ్చి వారికి భరోసా కల్పించి అదుకుంటున్నారు అని రైతులకు తెలిపారు. జనసేన జాని మాట్లాడుతూ ప్రభుత్వం ఇటు రైతులను, రైతు కార్మికులను, కౌలురైతులను మోసం చేస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి ని చేయాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వావిలపల్లి నాగ భూషణ్, కర్ణేన సాయి పవన్, దండేల సతీష్ లు పాల్గొన్నారు.