పూతలపట్టులో జనసేన పల్లెబాట

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పల్లెబాట కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు పురుషోత్తం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం పేరయ్య పల్లె పంచాయతీలో మండల కార్యదర్శి శ్రీమతి మహాలక్ష్మి ఆధ్వర్యంలో పలువురిని కలవడం జరిగింది. పార్టీ సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి తులసి, సీనియర్ నాయకులు మోహన్, చందు తదితరులు పాల్గొన్నారు.