ముగ్గురు అనాథల పాలిట దేవునిగా: సోనూసూద్

ఎక్కడ ఆపద ఉంటే అక్కడ నేనుంటా.. అనేలా దేవుడిలా మారుతున్న సోనూసూద్ నిజంగా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. అందరికీ. ఇప్పటి వరకు ఆయన చేసిన సహాయం ఏమిటీ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు, విమానాలు సొంత ఖర్చులతో వేయించి వారిని సొంత ఇంటికి చేర్చారు. ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. తాజాగా ఆయన ముగ్గురు అనాథ పిల్లలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వివరాలలోకి వెళ్ళగా.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రిలో ముగ్గురు పిల్లలు ఎవ్వరూ లేక అనాథలుగా బ్రతుకుతున్నారు. ముగ్గురిలో పెద్దవాడే.. మిగతా ఇద్దరి ఆలనా పాలనా చూస్తున్నారు. వారు మీ సహాయం కోసం ఎదురుచూస్తున్నారనే కథనం సోనూసూద్‌కు ట్యాగ్ అయింది. అంతే సోషల్ మీడియాలో వచ్చిన ఆ కథనం చూసి స్పందించిన సోనూసూద్.. ‘ఇకపై వారు ఎట్టిపరిస్థితుల్లోనూ అనాథలు కారు. వారి బాధ్యతను నేను తీసుకుంటున్నాను..’ అని ట్వీట్ చేశారు.