రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే బడ్జెట్: చొప్పా చంద్ర శేఖర్

అగమ్య గోచర స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఊరటను ఇచ్చే బడ్జెట్. విమర్శలకు తావులేని బడ్జెట్ ఇది. ఎందుకంటే మన రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేసిన బడ్జెట్ ఇది. కొంతమంది విమర్శకులు ఒకటే ఆలోచించాలి గత ఐదు సంవత్సరముల పాలనలో మన రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుంటుపడింది. అలాగే పట్టణ మరియు పల్లెలు అభివృద్ధి ఏమాత్రం జరగలేదు. విద్యా వ్యవస్థ కేవలం బడులకు వైసీపీ రంగులు వేయటంలోనే పరిమితమైంది. అలాగే పేద ప్రజలకు కేవలం తాయిలాలు తప్ప మౌలిక వసతుల కల్పన జరిగినది లేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అందించిన ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికైతేనేమి, విద్యా వ్యవస్థల అభివృద్ధికైతేనేమి. నీటిపారుదల రంగానికి అయితే నేమి రోడ్లు రవాణా వ్యవస్థలకైతేనేమి. అలాగే పేద ప్రజల ఆరోగ్యం కోసం అయితే నేమి. ముఖ్యంగా పల్లెలు, పట్టణాల అభివృద్ధికైతేనేమి. చేతి వృత్తుల కుటీర పరిశ్రమలకు. భారీ పారిశ్రామిక విధానానికి మేలు కలిగేలా ఇలాంటి ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలకు ప్రతి ఒక్కరికి 15000 చొప్పున ఎంతమంది చదువుతున్న అంతమందికి ఇచ్చే విధంగా తల్లికి వందనం పథకం. అదే విధంగా రైతులకు ఊరట ఇచ్చే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం 20,000 పెట్టుబడి సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పేద కుటుంబాలకు ఊరటనుఇచ్చే విధంగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ప్రతి పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల వరకు హాస్పటల్ ఖర్చు. ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలతో ఈ బడ్జెట్ ను ప్రభుత్వం రూపొందించి ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలకు మంచి మాత్రమే చేస్తుందని మరొకసారి నిరూపించుకుందని ప్రజలకు మరియు పాత్రికేయ మిత్రులకు జనసేన పార్టీ తరపున చొప్పా చంద్రశేఖర్ జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తెలపటం జరిగింది.

Share this content:

Post Comment