Heavy rains..అసెంబ్లీ మూడు రోజులు వాయిదా..!

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. తెలంగాణ అసెంబ్లీ మూడు రోజులపాటు వాయిదా పడింది. ప్రభుత్వం ఇప్పటికే మంగళవారం ప్రభుత్వ ఆఫీసులకు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ కూడా మూడు రోజుల తర్వాత జరపాలని నిర్ణయించారు.

పలు జిల్లాల్లో కుంభవృష్టి వానలు పడుతున్నాయి. ఇంకో రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అసెంబ్లీకి బ్రేక్ పడింది. మళ్లీ అక్టోబర్ 1న తిరిగి ప్రారంభం అవుతాయి సమావేశాలు. జిల్లాల్లో అధికారులే అంతా చూసుకోవడం కష్టంగా ఉంటుందని.. ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగాలని ఆదేశాలు వెళ్లాయి.