ఆస్తులను జప్తు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలి..!

పాలకొండ, రియల్ ఎస్టేట్ నిర్వాహకుడైన రాజేంద్రనాయుడు ఆస్తులను జప్తు చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వంను కోరుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం, ఎల్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ భాగస్వామి రేజేటి శేఖర్‌పై జరిగిన ఘటనను పాలకొండ జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. శేఖర్‌ను స్తంభానికి కట్టడం అనాగరిక చర్యగా పరిగణిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రభుత్వం డిమాండ్ చేసింది. గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో శేఖర్‌ను పరామర్శించిన సందర్భంగా, ఆయన వివరణ ఇచ్చారు. శేఖర్ తన డబ్బుతో పాటు తన బంధువులు, సన్నిహితుల వద్ద నుంచి పెట్టుబడులు సేకరించి, రియల్ ఎస్టేట్ నిర్వాహకుడు రాజేంద్రనాయుడుకు అందజేసి భాగస్వామి అయ్యాడు. రాజేంద్రనాయుడు తన బృందంతో కలిసి రియల్ ఎస్టేట్ బిట్లను విక్రయించడానికి ఏజెంట్లను నియమించాడు. అయితే అప్పులు తీర్చడానికి విఫలమవడంతో పాటు, రాజేంద్రనాయుడు కనపడకుండా పోవడం వల్ల అప్పుల దారులు ఆయన కుటుంబాన్ని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శేఖర్‌ను బాధ్యత వహింపజేసేందుకు అనాగరిక చర్యలకు పూనుకున్నారు. ఈ ఘటనను సభ్య సమాజం తలదించుకునే విధంగా అభివర్ణిస్తూ, రిజిస్ట్రేషన్ ప్రకారం వ్యాపారం నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకుంటే కోట్లు పెట్టుబడులు సేకరించి బాధ్యతలు తప్పించుకోవడం పరిపాటిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రనాయుడు ఆస్తులను సీజ్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని, నష్టపోయిన కుటుంబాలకు ఏమీ జరిగితే దానికి రాజేంద్రనాయుడు కుటుంబమే బాధ్యత వహించాలని జనసేన పార్టీ నేతలు కోరారు. నష్టపోయిన వారి కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగిన రాజేంద్రనాయుడు కుటుంబంనే బాధ్యత వహించాలి అని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, పోగ్రామ్ కమిటీ మెంబెర్ పొట్నూర్ రమేష్, అలజంగి శంకర్, గురుగుబిల్లి రవికుమార్, జామి అనిల్ జగన్ అన్నారు.

Share this content:

Post Comment