ఎగ్ వైట్ మరియు లెమన్ జ్యూస్ తో మీ చర్మంపై జిడ్డు మాయం

హలో ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తికి తన శరీర తత్వాన్ని బట్టి కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటి వెనుకఉన్న కారణాలు కనుక తెలుసుకున్నట్లయితే చిన్న చిన్న పద్ధతులు పాటిస్తూ అందం ఆరోగ్యం రెండూ సొంతం చేసుకోవచ్చు. సహజంగా ఏదైనా సమస్య రాగానే ఎవరో ఒకరి మీద ఆధారపడకుoడా, డాక్టర్ దగ్గరికి పరిగెత్తి వెళ్లడం కాకుండా, అందం కోసం పార్లర్ల చుట్టూ తిరగడం కాకుండా మీ సమస్యను మీరే అర్థం చేసుకొని చిన్న చిన్న బ్యూటీ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరుకుతుంది చాలా మందికి జిడ్డు చర్మం ఉంటుంది. స్నానం చేసినా తరచూ ఫేస్ వాష్ చేస్తున్నా ఫలితం ఉండదు. ఈ జిడ్డు వలన మేకప్ వేసినా నిలబడదు. ఈ సమస్యకు మన ఇంట్లోనే దొరికే చిన్నచిన్న పదార్దాలు ఉపయోగించుకుంటే కచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది, కాకపోతే రెండు లేదా మూడు వారాలు క్రమం తప్పకుండా వాడాలి.

కావలసిన పదార్ధాలు: ఎగ్ వైట్, లెమన్ జ్యూస్

ప్యాక్ వేసుకొనే విధానం:  ఎగ్ వైట్ కొంచెం లెమన్ జ్యూస్ బాగా మిక్స్ చేసి మొహానికి పట్టించుకుని 10 నిమిషాలు నుండి 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఎగ్ వైట్ లో విటమిన్ A తో ఎనరిచ్అయి ఉంటుంది. ఆయిల్ ను ప్రొడ్యూస్ చేసే గేలన్సు ను శుభ్రపరిచి ఎక్కువ సేపు  మీ స్కిన్ ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. ఈ ప్యాక్ వారానికి మూడు నాలుగు సార్లు చొప్పున రెండు మూడు వారాలు  కంటిన్యూ చేస్తే మీ చర్మంలో వచ్చే మార్పు మీరే గుర్తించొచ్చు, పైగా ఈ ఎగ్ వైట్ ప్యాక్ ఫేస్ లో వచ్చే రింకిల్స్ ను తొలగిస్తుంది.