రధసప్తమి వేడుకలలో పాల్గొన్న అతికారి దినేష్

రాజంపేట, రథసప్తమి సందర్భంగా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం కుంపినీపురం గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకి ఉత్సవ కమిటీ మరియు నూకినేనిపల్లె పంచాయతీ జనసైనికుల అహ్వనం మేర ముఖ్యఅతిథిగా రాజంపేట జనసేన పార్టీ సమన్వయ అతికారి దినేష్ పాల్గొనడం జరిగింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం జరుగుతున్న రథోత్సవ ఉత్సవంలో పాల్గొన్న అతికారి దినేష్ ని జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు ఆడుగడుగునా శాలువలు కప్పి పూలు చల్లుతు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయంలో అతికారి దినేష్ కి సన్మానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, గుగ్గిళ్ళ నాగర్జన, ఉపేంద్ర, పోలిశెట్టి శీనువాసులు, మస్తాన్ రాయల్, గురివిగారి వాసు, వినయ్ స్థానిక జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు భారీగా పాల్గొన్నారు.