యల్లటూరు శ్రీనివాస రాజుని మర్యాద పూర్వకంగా కలిసిన అతికారి కృష్ణ

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజుని జనసేన నాయకులు అతికారి కృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా స్వాగతించి శాలువాతో సత్కరించిన యల్లటూరు శ్రీనివాస రాజు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, నాసర్ఖాన్, గురివిగారి వాసు, అబ్బిగారి గోపాల్, కె.ఆర్, రాజేష్ వర్మ
మరియు అతికారి వెంకటయ్య, తెలుగుదేశం నాయకులు మాజీ కౌన్సిలర్ గుగ్గిళ్ల చంద్రమౌళి, అదృష్టదీపుడు, కంబయ్యగారి నరసింహ, పలు కార్యకర్తలు పాల్గొన్నారు.