గుంతకల్లు టౌన్ లో మహిళ పై దాడి

గుంతకల్లు, మొగుడు పిల్లలు ఎవరు లేని ఒంటరి మహిళను శ్రీలంక కాలనీకి చెందిన యువకుడు లైంగికంగా దాడి చేసి, ఆమెను శారీరకంగానూ విచక్షణారహితంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు మరియు వీర మహిళలు గుంతకల్లు ప్రభుత్వా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నా ఆమెను పరామర్శించి, జనసేన పార్టీ ఆమెకు అండగా ఉంటుందని బరోసా ఇచ్చారు. అనంతరం ఈ సమస్యను గుంతకల్లు డీఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్ళి బాధ్యత మహిళకు రక్షణ కల్పించి మరియు నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవల్సిందింగా జనసేన పార్టీ తరపున తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, వీరమహిళ విజయ మరియు నాయకులు విజయ్, వీరేష్, రవి, మహేష్, మణికంఠ లారెన్స్ తదితరులు పాల్గొన్నారు.