ఉదయగిరి నియోజకవర్గంలోని బసినేనిపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ వీర మహిళా నేత అడవుల సరితపై జరిగిన దాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అమానుష ఘటన తెలుసుకున్న జనసేన పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఆలూరు రవీంద్ర, మర్రిపాడు మండలాధ్యక్షురాలు ప్రమీల ఓరుగంటి ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్శించి, పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉన్నదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కోలా విజయలక్ష్మి మాట్లాడుతూ దళిత మహిళలపై దాడులను సహించము. సరితకి జరిగిన అన్యాయంపై పార్టీ తరఫున న్యాయం కోసం పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నాగేళ్ళ రవి, నాగేళ్ళ ఆనంద్, రాకేష్, హజరత్ యోహాన్, చంద్ర దేవసహాయం, చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు
Share this content:
Post Comment