కర్నూలు జనసేన పార్టీ మహిళా విభాగ కార్యాలయంపై దాడి హేయమైన చర్య: చింతా సురేష్ బాబు

*ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
*అధికార పార్టీకి జనసేన అంటే ఎందుకంత భయం.
*జనసేన పార్టీ కర్నూలు జిల్లా నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు.

కర్నూలు నగరం గణేష్ నగర్ లోని మేయర్ కార్యాలయం ఎదురుగా ఉన్న జనసేన పార్టీ మహిళా విభాగ కార్యాలయం పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింతా సురేష్ బాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… జనసేన పార్టీ రాయలసీమ వీర మహిళ కమిటీ మెంబర్ హసీనా బేగం కార్యాలయంపై అధికార ప్రోద్బలంతో గుర్తు తెలియని 15 మంది వ్యక్తులు దాడి చేసి కార్యలయంలోని సామాగ్రిని ధ్వంసం చేసి బయట పడేసి తాళాలు వేశారు. బిల్డింగ్ ఓనర్ ను సంప్రదించగా.. ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ దుస్సాహసానికి పాల్పడిన వ్యక్తులను కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని చింతా సురేష్ బాబు డిమాండ్ చేశారు. రాయలసీమ వీర మహిళ కమిటీ సభ్యురాలు శ్రీమతి హసినా బేగం జనసేన పార్టీ నాయకులు మహబూబ్ బాషా, నక్కలగుట్ట శ్రీనివాసులు, విశ్వనాధ్, మంజునాథ్, సుధాకర్, బజారి, శ్రీనివాసులు కార్యకర్తలు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇవ్వడం జరిగింది.దాడికి సంబందించిన సిసి కెమెరా వీడియో కాపిని పోలీసులకు అందజేసి మాకు తగిన న్యాయం చేయాలని మూడో పట్టణ సీఐ, పోలీసు అధికారులను కోరారు.