మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై దాడి గర్హనీయం

హైదరాబాద్ లోని మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై చోటు చేసుకున్న దాడి గర్హనీయం అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఖండించారు. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఇందుకు భిన్నంగా దాడులకు పాల్పడటం సమంజసం కాదు. మహా న్యూస్ ఛానెల్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యవాదులు తప్పనిసరిగా ఖండించాలి. ఈ దాడికి కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Share this content:

Post Comment