మహాన్యూస్ ఆఫీసు‍పై దాడి హేయమైన చర్య!

*దాడిని ఖండించిన జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా

హైదరాబాద్‌లో మహాన్యూస్ ఆఫీసుపై జరిగిన దాడిని జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు తీవ్రంగా ఖండించారు. బూతులు తిడుతూ విధ్వంసానికి పాల్పడిన ఘటన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యగా పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛను దాడులతో, బెదిరింపులతో కట్టడి చేయాలన్న ఆలోచన అర్థరహితమని బొర్రా వ్యాఖ్యానించారు. ప్రజలు ఇలాంటి దాడులను, బూతుల సంస్కృతిని ఎప్పటికీ ఆమోదించరని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దాడి ఘటనలో మహాన్యూస్ యాజమాన్యం, సిబ్బందికి తన పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నానని బొర్రా వెంకట అప్పారావు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment