మీడియా ప్రతినిధులపై దాడి సైకో చర్య: రెడ్డి అప్పలనాయుడు

  • దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలి
  • జర్నలిస్టుల రక్షణకు రూపొందించిన చట్టాలు అమలు చేయాలి
  • జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి డిమాండ్

ఏలూరు: ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వుంటూ ప్రజా సమస్యలు పట్ల బాధ్యతాయుతంగా తమ గళాన్ని వినిపిస్తూ విధి నిర్వహణలో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన పాత్రికేయులపై కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి అనుచరులు చేసిన ఆటవిక దాడి దుర్మార్గమైన చర్య అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అప్పలనాయుడు అన్నారు. ఫ్యాక్షనిజాన్ని తలపించే విధంగా నడి రోడ్డుపై రౌడీల్లాగా ప్రజల సాక్షిగా జర్నలిస్టులపై హత్యాయత్నం చేయడం, ప్రజాస్వామ్యాన్నే భక్షించే విధంగా,ఈ విధమైన దారుణం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. సమాచార సేకరణకు వెళ్లిన ఏబీఎన్ ప్రతినిధి శశి, హెచ్ఎంటివి ప్రతినిధి రత్నకుమార్ లపై రక్తం చిందే విధంగా అతని అనుచరులు భౌతిక దాడికి దిగి,ఏబీఎన్ వాహన అద్దాలను, హెచ్ఎంటివి కెమెరాలను ధ్వంసం చేయడం ఈ దుర్మార్గపు చర్యఅని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంగా ఎన్నుకోబడి గౌరవప్రదమైన పార్లమెంటేరియన్ పదవిలో వైసిపినాయకులు ఇలాంటి అప్రజాస్వామిక దాడులకు దిగడం మీడియా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన దుండగులపై, దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.