వైకాపా ప్రభుత్వంలో జర్నలిస్టులపై పేట్రేగుతున్న దాడులు: పెండ్యాల శ్రీలత

అనంతపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పెరుగుతున్న జర్నలిస్టుల మీద దాడులను నిరసిస్తూ ఏపియుడబ్ల్యుజె జర్నలిస్ట్ అసోసియేషన్ వారు ఛలో అనంతపురం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో వారి పిలుపు మేరకు జనసేన పార్టీ తరపున వారి నిరసనలు మద్దతు తెలుపి సంగమేశ్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీలో పాల్గొని అనంతరం జర్నలిస్ట్ సంఘం వారు ఏర్పాటు చేసిన భహిరంగ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ పాలన కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగి పోయాయని మొన్న శ్రీకృష్ణ పై, నిన్న కర్నూల్ ఈనాడు కార్యాలయం పై వైకాపా మూకలులు దాడులకు తెగబడుతున్నారని ఇన్ని దాడులు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఏది ఏమైనా జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.