రచయిత జీడిగుంట కన్నుమూత

ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి  కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం రామచంద్రమూర్తికి కరోనా సోకింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చే రారు. అయితే, పరిస్థితి విషమించి మంగళవారం తుదిశ్వాస విడిచారు. రామచంద్రమూర్తి భార్య పేరు రాజ్యలక్ష్మి. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వారి పేర్లు విజయసారథి, శ్రీధర్‌ (టెలివిజన్‌ నటుడు), వేణుగోపాల్‌. సినీ నటుడు వరుణ్‌ సందేశ్‌.. రామచంద్రమూర్తి మనవడే. రామచంద్రమూర్తి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు. పాఠశాల విద్యార్థి దశలోనే ఆయన ువిజయ చంద్రిక్‌ పేరుతో చేతిరాత పత్రికను నిర్వహించారు. 1959లో వరంగల్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగం పొందారు. 1960 నుంచి కథారచన ప్రారంభించారు. సుమారు నాలుగు వందల కథలు రాశారు. ‘తరంగిణి’, ‘గుడిలో పువ్వు’, ‘తాతా ధితై తథిగిణతోం’ తదితర నవలలు, పలు నాటకాలతో మొత్తం 19 పుస్తకాలు రచించారు.