విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: బత్తుల దంపతులు

రాజానగరం, జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, వారి సతీమణి మరియు ‘నా సేవ కోసం నా వంతు’ కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనంకోసం జనసేన మహా పాదయాత్ర 23 వ రోజు భాగంగా కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ జనసేన పార్టీ విధి విధానాలతో ముద్రించిన కరపత్రాలు పంచుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు వివరిస్తూ ప్రజలందరూ ఐకమత్యంగా ఈసారి మార్పు కోరుకుని జనసేన ప్రభుత్వం స్థాపించడానికి సహకరించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో భారీ వర్షాలు కారణంగా అస్తవ్యస్తంగా తయారైన డ్రైనేజీ వ్యవస్థ గురించి మీడియా జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ‘నా సేవ కోసం నా వంతు’ కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ…. ప్రజలకు విష జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గతేడాది ఇదే సమయంలో గ్రామాల్లో అనేకమంది డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడిన సంగతిని గుర్తు చేశారు. పంచాయితీ సిబ్బంది, అధికారులు నిరంతరం శానిటేషన్ చేస్తూ ఉండాలని, కాలువల్లో డ్రైనేజి వ్యర్ధాలు లేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. ఇప్పటి నుండే తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారని, తమ సూచనను అధికారులు సహృదయంతో స్వీకరించి విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని బత్తుల దంపతులు కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.