అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘననివాళులు అర్పించిన అవనిగడ్డ జనసేన

మార్చి16, బుధవారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో అవనిగడ్డలోని ఫైర్ స్టేషన్ పక్కన గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎంపీటీసీ కటికల వసంత్, జన సైనికులు రాజనాల వీరబాబు, ఫరీద్ గారు పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడుతూ..
ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలను అర్పించడమే కాకుండా.. మహాత్మా గాంధీ బోధించిన సత్యం అహింస ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, అలాగే దేశంలోనే అత్యధిక రోజులు నిరాహారదీక్ష చేసిన జతిన్ దాస్ తర్వాత స్థానంలో పొట్టి శ్రీరాములు నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చన్నగిరి సత్యన్నారాయణ, ఎంపీటీసీ కటికల వసంత్, ఎంపీటీసీ బొప్పన భాను, రాజనాల వీరబాబు, జేమ్స్, తోట ఆంజనేయులు, తుంగల నరేష్, నరేష్ కమతo,గుగ్గిలం అనిల్, గౌస్ కాటమ, పప్పుశెట్టి శ్రీను, పోతిన నాగరాజు, మత్తి గోపాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.