స్థాయిలేని విమర్శలు మానుకోండి!

*వైసీపీకి జనసేన నేతల హెచ్చరిక

గుత్తి పట్టణ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ శ్రేణులు వైసీపీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. “మా నాయకుడిపై మాట్లాడితే పదవులు లేకపోయినా, సాధారణ కార్యకర్తలు కూడా ఊరుకోరు” అని వారన్నారు. వైసీపీ నేతలు చేసిన వ్యక్తిగత విమర్శలు, వారి చౌకబారు రాజకీయ ధోరణి పై విరుచుకుపడ్డ జనసేన శ్రేణులు, ప్రజా అభిప్రాయం కూటమి ప్రభుత్వంతో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి వాస్తవంగా జరుగుతోందని పేర్కొన్నారు. వాసగిరి మణికంఠ వంటి నిజాయితీ నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడమే వైసీపీ దౌర్భాగ్యమన్నారు. “అక్రమం, అవినీతి, అబద్ధమే మీ అసలు స్వరూపం, కానీ మా నాయకుల నైతికతతో మీకు పోలిక లేదు” అని వారు తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తుచేసే జనసేన నేతలు, రాజకీయాలలో విమర్శలు విధానపరంగా ఉండాలని సూచించారు. గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్తను మందిర దర్శనానికెళ్లినందుకు విమర్శించడం వెనక ఉన్న రాజకీయ దురుద్దేశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాటిల్ సురేష్, బోయగడ్డ బ్రహ్మయ్య, వెంకటపతి నాయుడు, మిద్దె ఓబులేష్, మురళి నాయక్, గంగరాటాల భాష, ఆమదాల రమేష్, రంగా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. “వైసీపీ నేతలు ఇకనైనా తమ మాటల మీద నియంత్రణ కలిగి ఉండకపోతే, ప్రజల నుంచే తీవ్ర ప్రతిఫలాలు ఎదురవుతాయి” అని హెచ్చరించారు.

Share this content:

Post Comment