క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతి ప్రదానం

మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడు మండలం, గొట్లం పంచాయితీలో శ్రీ శ్రీ చింతలమ్మ తల్లి తీర్థ మహోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో రెండవ బహుమతిని దాతలు మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ, కె.కోటపాడు మండలం జనసేన నాయకులు కుంచా అంజిబాబు 10000/- రూపాయలు అందించారు. ఈ సందర్భంగా అంజి బాబు మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో తోడ్పడతాయని, అదేవిధంగా ఎప్పుడు క్రీడలు నిర్వహించినా మా వంతు జనసేన తరఫున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.