పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థులకు అవగాహన సదస్సు.!

డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత ఏయే కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలో అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ డి.ఓ.ఏ విభాగం ఆద్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో “స్టూడెంట్ కెరీర్ గైడెన్స్ ఆన్ పీజీ కోర్సెస్ ఎన్ ఏ.కే.యూ” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ డి.ఓ.ఏ. విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ జి.సోమ శేఖర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సోమశేఖర మాట్లాడుతూ 2025 – 26 విద్యాసంవత్సరం నందు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సెట్ లకు నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 13 కోర్సులకు సంబంధించి ప్రవేశాల కోసం పలు అంశాలపై ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు మాట్లాడుతూ ఏ.పి.పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్ష లను 9-6-3025 నుంచి 13-6-2025 వరకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం లో ప్రవేశాల కోసం 25-06-2025 న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏ.కే.యూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం డైరెక్టర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ నిర్మలా మణి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు పి.జి.ప్రవేశాలతో పాటుగా రీసెర్చ్ కు సంబంధించి వివిధ బోధనా అంశాలలో పిహెచ్.డి అడ్మిషన్లు కూడా నిర్వహిస్తున్నామని, 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు పిహెచ్.డి ప్రవేశం కోసం పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులలో ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే,2వ తేదీ నుంచి మే,5వ తేదీ వరకు నిర్వహించే ఏ.పి.ఆర్.సెట్ కు దరఖాస్తు చేసుకొని అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుందని తెలిపారు. ఏ.కే.యూ కామర్స్ అండ్ బిజినెస్.అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి డాక్టర్ బి పద్మజ మాట్లాడుతూ ఎం.బి.ఏ ప్రవేశం కోసం మే, 7వ తేదీన రాష్ట్ర స్థాయిలో ఉమ్మడిగా నిర్వహించే ఏ.పి.ఐసెట్ పరీక్ష నందు ఉత్తీర్ణత సాధించ వలసి ఉంటుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం ప్రొఫెసర్ జి.సోమశేఖర్, డి.ఓ.ఏ, ఏకేయూ వారిని సెల్ నెంబర్లు 63043434448, 8978496178 లలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.కే.యూ ఆక్వా కల్చర్ విభాగం సహాయ ఆచార్యుడు డాక్టర్ బి.సురేష్, శ్రీ హార్షిణి డిగ్రీ కళాశాల డీన్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి, ఏ.కే.యూ డి.ఓ.ఏ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Share this content:

Post Comment