బూత్ కమిటీల గురించి అవగాహనా కార్యక్రమం

కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు కనిగిరి సెంట్రల్ కమిటీ సభ్యులు మాదాసు రమేష్ ఆధ్వర్యంలో హనుమంతునిపాడు మండల నాయకులు ఆకుపాటి వెంకట్రావు మండలంలోని గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడ కార్యకర్తలతో జనసైనికులతో కలిసి పార్టీ బలోపేతం గురించి మాట్లాడి హనుమంతునిపాడు, వెంగపల్లి, మహ్మదాపురం, వెంకట్రాయున్ని పాలెం, మరియు నందనవనంలోని జనసైనికులకి బూత్ కమిటి గురించి వివరించడం జరిగింది. తదుపరి శతఘ్ని న్యూస్ క్యాలెండర్ ను కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు ఆకుపాటి వెంకట్రావు, శానం ఆంజనేయలు ముద్దా ప్రేమ్ కుమార్, నాగేంద్ర బాబు, ముత్యాల నరేష్, తమ్మిశెట్టి రవీంద్ర తదితరులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.