ప్రచార వేగాన్నిపెంచిన టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల

కోనసీమ జిల్లా: అమలాపురం నియోజకవర్గ టిడిపి కూటమి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు తన ప్రచార వేగాన్ని పెంచారు. గురువారం అమలాపురం ఎంపి అభ్యర్థి గంటి హరీష్ మాథుర్, ఆనందరావుతోపాటు ప్రచారంలో ఫాల్గొన్నారు. అల్లవరం మండలం బోడాసు కుర్రు, అల్లవరం, కోడూరుపాడు, గ్రామాలలో పర్యటించారు. కూటమి ఉమ్మడి ‌మేనిఫెస్టోను వివరిస్తూ ఇంటింటికి తిరిగి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను, హరీష్ మాధుర్ ను, గెలిపించాలని ఓటరులను అభ్యర్థించారు. అడుగడుగునా మహిళలు ఆనందరావుకు హారతులిచ్చి నీరాజనాలు పలికారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు ఇద్దరూ విజయపథంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో దెందుకూరి సత్యనారాయణ రాజు, శ్రీరామ్, వేగిరాజు వెంకటరాజు, రొక్కాల విజయలక్ష్మి, రొక్కాల నాగేశ్వరరావు, చింత శ్రీను, గణపతి, కొల్లు విష్ణుమూర్తి, లంకె భీమరాజు, యాళ్ల దొరబాబు, కంకిపాటి వీరబాబు, అడపా శ్రీను, మామిడిశేట్టి శ్రీరామ్, రాసూరి రాంబాబు, సుంకర సాయి, కె.వి,విప్పర్తి రామకృష్ణ, అంబటి లక్ష్మణ్, మోసిగంటి దుర్గారావు, మోసిగంటి, ఆకుల బుజ్జి, నాగిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు.