గుంటూరులో అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకలు

గుంటూరు: దేశవిదేశాల్లో ఉన్న భారతీయుల హృదయాలు శ్రీరామ నామంతో పులకిస్తుండగా సోమవారం అయోధ్యలో బాలరామునికి పట్టాభిషేకం జరిగింది. ఈ నేపథ్యంలో అయోధ్య పురోహితుల పిలుపుమేరకు శ్రీనివాసరావుతోటలో ఐదు కాగడాలతో దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి పారవశ్యంతో పలికిన జై శ్రీరామ్ నినాదంతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం పెద్దఎత్తున బాణాసంచా పేల్చుతూ శ్రీరామ దీపావళి నిర్వహించారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర కార్యదర్శి మెహబూబ్ బాషా, రెల్లి యువ నేత సోమి ఉదయ్, రాసంశెట్టి బుజ్జి , శంకర్ సిద్ధాంతి, కేశవదాసు, వడ్డె సుబ్బారావు, నండూరి స్వామి, తాడికొండ శ్రీను, షేక్ నాజర్, విజయ్, సాయి, అలా కాసులు, అభినయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.